మారుతున్న విద్యా విధానంపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలి: ఐఏఎస్ సీతాలక్ష్మి

కలం, జనగామ : జనగామ జిల్లాలోని తెలంగాణ గిరిజన సంక్షేమ నివాసిత మహిళా డిగ్రీ కళాశాల (TGTWRDCW) వేదికగా ‘ప్రజ్ఞాన్ సైన్స్ ఫెస్ట్ 2026’(PRAGYAN 2026) అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ముఖ్య అతిథిగా TGTWREIS సెక్రటరీ కె. సీతాలక్ష్మి (Seethalakshmi) హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ, ప్రస్తుత విద్యా విధానంలో వచ్చే కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను అవగాహన చేసుకోవాలని, పరిశోధన రంగంలో ముందంజ వేసేందుకు ప్రేరేపించారు. ముఖ్యంగా AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), క్వాంటం శాటిలైట్ టెక్నాలజీ వంటి అత్యాధునిక సాంకేతికతలను వినియోగించి, యువత తమ ప్రతిభను ప్రదర్శించాలని సిఫార్సు చేశారు.

క్రమంలో విద్యార్థినులు ప్రదర్శించిన లైవ్ ఎక్స్‌పెరిమెంట్స్, సైన్స్ ఎగ్జిబిట్స్, పోస్టర్ ప్రెజెంటేషన్లు  ఆసక్తిగా పరిశీలించి, వారి సృజనాత్మకత, ప్రతిభను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా. జి. సంధ్యారాణి, డిప్యూటీ సెక్రటరీలు డి.ఎస్. వెంకన్న, కె. వేణుగోపాల్, OSD డా. సతీష్ గౌడ్, వివిధ రాష్ట్ర స్థాయి డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సైన్స్ ఫెస్ట్ యువతలో విజ్ఞానపరిజ్ఞానం  పట్ల అవగాహన, సృజనాత్మకత, పరిశోధనల పట్ల ఉత్సాహం పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించబడింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>