కలం, వరంగల్ బ్యూరో : హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని శాయంపేట, ఆరేపల్లి గ్రామాల్లో సుమారు 200 కుక్కలను (Dogs) గ్రామపంచాయతీ సిబ్బంది హతమార్చారు. ఈ విషయం తెలుసుకున్న స్వచ్ఛంద సంస్థ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యాధిన పడ్డ కుక్కలను (Dogs) గుర్తించి చంపామని గ్రామ సర్పంచ్ లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పాతిపెట్టిన కుక్కల శవాలను వెలికితీసిన వెటర్నరీ డాక్టర్లు శాంపిల్స్ సేకరించారు. ఆ శాంపిల్స్ ను పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపనున్నట్లు అధికారులు తెలిపారు.


