పెద్దపల్లిలో సాఫీగా ధాన్యం కొనుగోళ్లు: విప్ విజయరమణ రావు

కలం, కరీంనగర్ బ్యూరో: రైతుల విషయంలో ఎలాంటి రాజకీయ భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా పని చేస్తున్నామని ప్రభుత్వ విప్, పెద్దపల్లి (Peddapalli) శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు తెలిపారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు సాఫీగా జరుగుతున్నాయని.. మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడటాన్ని పూర్తిగా ఖండిస్తున్నామని తెలిపారు. మనోహర్ రెడ్డి హయంలో క్వింటాకు 10 నుంచి 15 కిలోల వరకు కోతలు విధించారని గుర్తు చేశారు. రాష్ట్రంలోనే వరి కొనుగోళ్లో పెద్దపల్లి నాలుగో స్థానంలో ఉందని.. మనోహర్ రెడ్డికి తెలిసినంత అక్రమ దందాల గురించి తమకు తెలియదన్నారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తున్నట్లు వివరించారు.

మట్టి అక్రమ దందాలు చేసిందెవరో..

ప్రభుత్వం సేకరించిన మక్కలకు మార్కెటింగ్ లేకున్నా నష్టాన్ని భరిస్తూ ప్రభుత్వం ముందుకు వెళుతుందని విప్ విజయరమణారావు (MLA Vijaya Ramana Rao) చెప్పారు. గత బిఆర్ఎస్ పాలనలో అప్పటి ప్రజాప్రతినిధులు కొనుగోళ్లలో పూర్తి స్థాయిలో రైతులకు అన్యాయం చేశారని చెప్పారు. మట్టి అక్రమ దందాలు చేసి వారి విద్యాసంస్థల్లో నిల్వ చేసుకున్న చేసుకున్న విషయం ప్రజలకు తెలుసని.. గతంలో పెద్దపల్లి (Peddapalli) పట్టణంలోని వ్యవసాయ గోదాం రేకులు కూడా ఎత్తుకుపోయిన ఘనత మాజీ ఎమ్మెల్యేదే అని మనోహర్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్, వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్లు, డైరెక్టర్లు, సింగిల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, పలు గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Read Also: ఘోస్ట్ సిమ్ కార్డుల నెట్‌వర్క్‌ గుట్టురట్టు

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>