దేశంలోని దగ్గు మందు(Cough Syrup) సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. వచ్చే ఏడాది 1 నాటికి ప్రతి సంస్థ తన పద్దతులు మార్చుకోవాలని తేల్చి చెప్పింది. కొంతకాలంగా దేశంలో దగ్గు మందుల అంశం సంచలనంగా మారింది. ‘కోల్డ్‌రిఫ్’ దగ్గు మందు వల్ల పలు రాష్ట్రాల్లో చిన్నారులు మరణించడంతో ఈ అంశం నేషనల్ వైడ్‌గా హాట్ టాపిక్‌గా మారింది. దగ్గు మందులపై ప్రపంచమంతా ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే చిన్నారులకు అసలు దగ్గు సిరప్‌లను సిఫార్సు చేయకూడదని కూడా పలు ఆరోగ్య సంబంధిత సంస్థలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే దగ్గు మందుల తయారీ ప్రాధాన్యం సంతరించుకుంది. చాలా సంస్థలు నిబంధనలను తుంగలో తొక్కుతూ ఔషధాలను తయారు చేస్తున్నాయని అధికారులు దృష్టికి వచ్చింది.
ఈ అంశంపై కీలకంగా మారడంతో తాజాగా దగ్గు మందుల(Cough Syrup) సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. 2026 జనవరి 1 నాటికి అన్ని దగ్గు మందు తయారీ సంస్థలు అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాలని తేల్చి చెప్పింది. ఏ సంస్థ అయినా నిబంధనలను పాటించకోతే సంస్థను మూసేసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనౌజేషన్(CDSCO) ఆదేశాలిచ్చింది. ఈ ఆఖరు తేదీ విషయంలో ఎటువంటి సడలింపులు, పొడిగింపులు ఉండవని అధికారులు చెప్పారు. అన్ని ఔషధ తయారీ సంస్థలు కూడా గ్లోబల్ గుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసస్‌కు అనుగుణంగా ఉండాలని తెలిపింది.
Read Also: భారత్‌లో ఉగ్రస్థావరాల ఏర్పాటుకు పాక్ కుట్ర?
Follow Us on: Youtube

