Mobile Popup Ad
Mobile Popup Ad

డ్రగ్స్ రహిత సమాజం అందరి బాధ్యత: గవర్నర్ శుక్లా

కలం, వరంగల్ బ్యూరో: జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (IDOC) వేదికగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘నషా ముక్త్ భారత్’ కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ రహిత తెలంగాణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా (Shiv Pratap Shukla) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హన్మకొండ ఐడీఓసీకి చేరుకున్న గవర్నర్‌కు జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా డ్రగ్స్ నిర్మూలన అవశ్యకతను తెలియజేసే ప్రత్యేక పోస్టర్లను గవర్నర్ ఆవిష్కరించారు. అనంతరం అక్కడకు చేరుకున్న విద్యార్థులు, యువతతో డ్రగ్స్ నిర్మూలనపై ఆయన ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ రహిత భారత్, డ్రగ్స్ రహిత తెలంగాణ సాధన మనందరి బాధ్యత అని ఈ సందర్భంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా (Shiv Pratap Shukla) పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా ‘నషా ముక్త్ భారత్’ కార్యక్రమం అమలవుతోందని ఆయన గుర్తుచేశారు. కార్యక్రమం ముగిసిన అనంతరం సమాజంలో అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన భారీ ర్యాలీని గవర్నర్ జెండా ఊపి ప్రారంభించారు.

Read Also: ఖమ్మంలో రాష్ట్రంలోనే తొలి ప్రైవేట్ ఆయిల్ పామ్ కాంప్లెక్స్

Read Also: డిజిటల్ వారసులు 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>