పోలీసుల ఫిట్‌నెస్‌పై ఎస్పీ ఫోకస్.. ఇకపై ప్రతి శనివారం యోగా!

కలం, ఆదిలాబాద్: పోలీస్ విధుల్లో క్రమశిక్షణ, సమయపాలన, నిజాయితీ ఎంతో కీలకమని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ (SP Akhil Mahajan) అన్నారు. శనివారం ఆదిలాబాద్ (Adilabad) ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో పోలీస్ సిబ్బందికి పరేడ్‌ (Police Parade) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మ్స్ డ్రిల్, స్క్వాడ్ డ్రిల్‌ను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతి పోలీస్ సిబ్బంది యూనిఫామ్ గౌరవాన్ని కాపాడుతూ సమయపాలన, క్రమశిక్షణ, నిజాయితీతో విధులు నిర్వర్తించాలని సూచించారు.

విధి నిర్వహణలో అప్రమత్తతతో పాటు ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి శనివారం పరేడ్ లేదా యోగా నిర్వహించుకోవాలని, 50 ఏళ్లు పైబడిన సిబ్బందికి ప్రత్యేకంగా యోగా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సిబ్బంది ఆరోగ్యంగా, దృఢంగా ఉన్నప్పుడే ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించగలరని ఎస్పీ పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>