Mobile Popup Ad
Mobile Popup Ad

మహిళా రిజర్వేషన్లపై రాజకీయ కుట్ర : సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్ : మహిళా రిజర్వేషన్ల బిల్లు, డీలిమిటేషన్ అంశంలో రాజకీయ కుట్ర, వివక్ష కలిసి ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహిళా రిజర్వేషన్ల బిల్లు, డీలిమిటేషన్ పై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకం అని బీజేపీ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ ఒకే అంశంగా చూపిస్తోందని ఆయన విమర్శించారు.

2024 కు ముందే ఈ బిల్లును అమలు చేయాల్సిందని సీఎం అభిప్రాయపడ్డారు. అప్పుడే ఎక్కువ మంది మహిళలు పార్లమెంట్ కు ఎన్నికయ్యేవారన్నారు. ఉన్న సీట్ల ఆధారంగా 33 శాతం మహిళా రిజర్వేషన్ల (Women Reservations) బిల్లు తీసుకొస్తే కాంగ్రెస్ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. 2013లో మహిళా రిజర్వేషన్ల బిల్లును కాంగ్రెస్ తీసుకొస్తే బీజేపీ సహకరించలేదని విమర్శించారు. చట్టంలో ఫిట్టింగ్ పెట్టి మహిళలకు రిజర్వేషన్లను బీజేపీ దూరం చేసిందని సీఎం (CM Revanth Reddy) ధ్వజమెత్తారు.

Read Also: భూ భార‌తికి ఏడాది… అధికారుల‌తో మంత్రి పొంగులేటి స‌మీక్ష‌

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>