కలం, వెబ్ డెస్క్: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కిష్టాపూర్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో జోగు సత్యనారాయణ పెంకుటిల్లు పూర్తిగా దగ్ధమైంది(Fire Accident). మంటల ధాటికి ఇంట్లోని గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో 1.80 లక్షల నగదు, బంగారు ఆభరణాలు, ఇంట్లోని వస్తువులు కాలిపోయాయి. మొత్తం సుమారు 6 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. నవోదయ ప్రవేశ పరీక్ష కోసం కుమారుడిని తీసుకుని సత్యనారాయణ ఇంటి నుంచి బయటకు వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయగా, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ ప్రభుత్వాన్ని కోరారు.

