వైద్య పరీక్షలకని వెళ్తే.. బంగారు నగలు మాయం!

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని ఏ.ఎస్.రావు నగర్‌ (AS Rao Nagar)లో ఉన్న మెడ్ ప్లస్ డయాగ్నస్టిక్ సెంటర్‌లో చోరీ ఘటన వెలుగుచూసింది. వైద్య పరీక్షల నిమిత్తం వచ్చిన ఒక మహిళ తన వద్ద ఉన్న సుమారు నలబై గ్రాముల బంగారు నగలని కోల్పోయింది (Gold Jewellery Stolen).

డయాగ్నస్టిక్ సెంటర్‌లో పరీక్షలు ముగించుకుని ఇంటికి వెళ్లిన తర్వాత పరిశీలించుకోగా, నగలు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైంది. దీంతో బాధితురాలు వెంటనే కుషాయిగూడ పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. మహిళ అందించిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న కుషాయిగూడ పోలీసులు, డయాగ్నస్టిక్ సెంటర్‌లోని సిసిటివి దృశ్యాలను పరిశీలిస్తూ దర్యాప్తు వేగవంతం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>