కలం, వెబ్ డెస్క్ : బంగారం ధరలు (Gold Rates) భారీగా పడిపోయాయి. గత వారం రోజులుగా బంగారం ధరలు భారీగా తగ్గుతున్న సంగతి మనకు తెలిసిందే. పశ్చిమాసియా యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ రేట్లు పెరగడంతో బంగారం ధరలు వారం రోజుల్లో రూ.12వేల దాకా తగ్గాయి. గత నాలుగు రోజులుగా ప్రతిరోజూ తులం బంగారం మీద కనీసం రూ.2 వేల దాకా తగ్గుతూ వచ్చింది. ఇక నేడు 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.5,950 తగ్గి 1,40,020 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.5450 తగ్గి రూ.1,28,350 వద్ద ట్రేడ్ అవుతోంది.
అటు వెండి ధరలు కూడా భారీగా పడిపోయాయి. కిలో వెండిపై ఏకంగా రూ.15వేలు రూ.2,30,000 గా ట్రేడ్ అవుతోంది. ఇరాన్ వర్సెస్ అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ కొరత ఏర్పడి బ్యారెల్ ధరలు పెరిగాయి. దీంతో డాలర్ ను ఎక్కువ దేశాలు కొనుగోలు చేయడంతో దాని వాల్యూ పెరిగింది. ఇన్వెస్టర్లు బంగారం నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకుని డాలర్ మీద పెడుతున్నారు. ఈ కారణంగానే బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. యుద్ధం మరికొన్ని వారాలు కొనసాగితే బంగారం రేట్లు మరింత తగ్గే ఛాన్స్ ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

