Mobile Popup Ad
Mobile Popup Ad

ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌పై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం

క‌లం, వెబ్ డెస్క్‌: తెలంగాణ అసెంబ్లీ (Assembly) స‌మావేశాలు మొద‌ల‌య్యాయి. శాస‌న‌స‌భ‌, మండ‌లిలో ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌ (Fee Reimbursement) అంశంపై చ‌ర్చించాల‌ని బీఆర్ఎస్ (BRS) వాయిదా తీర్మానం అంద‌జేసింది. ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బ‌కాయిలు చెల్లించ‌క‌పోవ‌డం వ‌ల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని బీఆర్ఎస్ నేత‌లు పేర్కొంటున్నారు. గ‌న్ పార్క్ ద‌గ్గ‌ర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ విడుద‌ల చేయాల‌ని ధ‌ర్నా చేశారు. ప్ర‌జా వ్య‌తిరేక ప్ర‌భుత్వం న‌శించాల‌ని నినాదాలు చేశారు. అనంత‌రం గ‌న్ పార్క్ నుంచి అసెంబ్లీకి ర్యాలీగా బ‌య‌లుదేరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>