హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

కలం, వరంగల్ బ్యూరో: మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా కురవి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ మహబూబాబాద్ ప్రధాన జిల్లా, సెషన్స్ కోర్టు (Sessions Court) మంగళవారం తీర్పు ఇచ్చింది. కురవి మండలం కొత్త తండా, నారాయణపురం గ్రామానికి చెందిన మాలోత్ సేవ్యా ఇచ్చిన ఫిర్యాదు మేరకు బానోత్ భద్రు అనే నిందితుడిపై కురవి పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం పోలీసులు చార్జ్ షీట్‌ను కోర్టులో సమర్పించారు.

ఈ కేసు SC No. 367/2022 గా విచారణ జరగగా, అన్ని ఆధారాలు పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి మహమూద్ అబ్దుల్ రఫీ అభియోగాలు రుజువైనట్లు నిర్ధారించారు. అనంతరం నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.25,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ తీర్పుతో న్యాయవ్యవస్థపై విశ్వాసం మరింత బలపడిందని స్థానికులు పేర్కొన్నారు.

Read Also: కాంగ్రెస్‌కు రాజీనామాపై జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్

Follow Us On: Facebook

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>