కలం, వెబ్‌డెస్క్: నేటి కాలంలో మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది ఎదుర్కొనే సమస్య అధిక బరువు. అయితే బరువు తగ్గేందుకు చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తారు. కొందరు కఠినమైన డైట్లను పాటిస్తూ ఆహారం తినడం మానేస్తే, మరికొందరు మార్కెట్‌లో విన్న ప్రతి డైట్‌ను పాటిస్తూ ఇబ్బంది పడుతుంటారు. కానీ మన వంటింట్లో ఉండే నెయ్యిని (Ghee Benefits) సరైన పద్ధతిలో తీసుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గొచ్చని సూచిస్తున్నారు ఆయుర్వేద నిపుణులు. అదెలాగో తెలుసుకుందాం.
ఆయుర్వేదం ప్రకారం నెయ్యిలో మన శరీరానికి మేలు చేసే అనేక పోషకాలు నిండి ఉన్నాయి. దీనిని ప్రతిరోజూ ఉదయం వేడి నీటిలో కలుపుకుని తాగడం వల్ల శరీరానికి ఊహించని ప్రయోజనాలతో పాటు బరువు తగ్గే ప్రక్రియ వేగవంతం అవుతుంది. ప్రతిరోజూ ఉదయం పరగడుపున గోరువెచ్చని నీటిలో ఒక చెంచా శుద్ధమైన నెయ్యి కలుపుకుని తాగడం వల్ల శరీర జీవక్రియలు వేగవంతమై బరువు చాలా సులభంగా తగ్గుతారని సూచిస్తున్నారు నిపుణులు. నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు, కేలరీలను వేగంగా కరిగించి శరీరంలోని మొండి కొవ్వును వదిలించడంలో అద్భుతంగా సహాయపడతాయట.
జీవక్రియల వేగం
ఆరోగ్య శాఖ నివేదికల ప్రకారం బరువు తగ్గడానికి గోరువెచ్చని నీటితో నెయ్యి తీసుకోవడం ఒక ఉత్తమమైన మార్గమట. నెయ్యిలో శరీరానికి మేలు చేసే ‘ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు’ పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు. ఉదయాన్నే వేడి నీటితో నెయ్యిని తీసుకున్నప్పుడు అది శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేసి, శరీర జీవక్రియను విపరీతంగా పెంచుతుంది. శరీర మెటబాలిజం రేటు పెరిగినప్పుడు మనం తీసుకునే ఆహారంలోని కేలరీలు చాలా సమర్థవంతంగా వేగంగా కరిగిపోతాయి. దీనివల్ల శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోకుండా బరువు నియంత్రణలోకి వస్తుందని సూచిస్తున్నారు నిపుణులు.
జీర్ణవ్యవస్థ శుభ్రత
మన జీర్ణక్రియను మెరుగుపరచడంలో నెయ్యి ఒక సహజసిద్ధమైన లూబ్రికెంట్‌లా పనిచేస్తుందని సూచిస్తున్నారు నిపుణులు. ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగినప్పుడు, అది జీర్ణవ్యవస్థలోని పేగులను లూబ్రికేట్ చేసి పేరుకుపోయిన వ్యర్థాలను పూర్తిగా శుభ్రపరుస్తుందట. ఇది మనం తినే ఆహారంలోని పోషకాలను శరీరం వేగంగా శోషించుకునేలా చేయడంలో తోడ్పడుతుంది. అలాగే ఈ పానీయం ఆకలిని కలిగించే హార్మోన్లను అదుపులో ఉంచి, రోజంతా అనవసరమైన జంక్ ఫుడ్స్ తినాలనే కోరికను అతిగా తినడాన్ని సమర్థంగా నివారిస్తుంది.
విషపదార్థాల విడుదల
ఆయుర్వేద శాస్త్రంలో నెయ్యికి అద్భుతమైన విషహరణ గుణాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఉదయం గోరువెచ్చని నీటితో నెయ్యిని తాగడం వల్ల శరీరంలోని అంతర్గత అవయవాలలో ఉన్న హానికరమైన విషపదార్థాలు చాలా సులభంగా బయటకు వెళ్లిపోతాయి. ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడమే కాకుండా, రోజంతా శరీరం ఎంతో చురుగ్గా, శక్తివంతంగా ఉండేలా తోడ్పడుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు ఇకపై ప్రతిరోజూ ఉదయం తాగే కెఫిన్ పానీయాలైన టీ లేదా కాఫీలకు ప్రత్యామ్నాయంగా ఈ నెయ్యి కలిపిన గోరువెచ్చని నీటిని అలవాటు చేసుకోవడం మంచిది. దీనితో పాటు ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడవడం వంటి వ్యాయామాలు చేయడం వల్ల బరువు మరింత వేగంగా తగ్గుతారని చెబుతున్నారు నిపుణులు.

