Mobile Popup Ad
Mobile Popup Ad

నార్వే చెస్‌ టైటిల్ రేసులోకి ప్రజ్ఞానంద.. గుకేశ్ చిత్తు!

కలం, స్పోర్ట్స్ : నార్వే చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద (Praggnanandhaa) అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. వరుసగా మూడు క్లాసికల్ గేమ్‌లలో విజయాలు సాధించిన అతడు ఇప్పుడు టైటిల్ పోరులో బలమైన పోటీదారుడిగా నిలిచాడు. ఇటీవలి మూడు రౌండ్లలో ప్రజ్ఞానంద ప్రపంచ స్థాయి ఆటగాళ్లైన అలిరెజా ఫిరౌజా, మాగ్నస్ కార్ల్సెన్, డొమ్మరాజు గుకేశ్‌లను ఓడించాడు. ఈ విజయాలతో అతడు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి మరింత చేరువయ్యాడు.

గురువారం జరిగిన తొమ్మిదో రౌండ్‌లో అందరి దృష్టి గుకేశ్- ప్రజ్ఞానంద మ్యాచ్‌పైనే నిలిచింది. టోర్నీలో ఐదో రౌండ్‌లో గుకేశ్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రగ్యానంద ఈ మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకున్నాడు. తెల్ల పావులతో ఆడిన గుకేశ్ ప్రారంభంలో దూకుడుగా కనిపించాడు. అయితే ప్రజ్ఞానంద సరైన సమయంలో ప్రత్యుత్తరం ఇచ్చాడు. ప్రత్యర్థి పావుల నిర్మాణాన్ని లక్ష్యంగా చేసుకుని మరోవైపు ఒత్తిడి పెంచాడు. మ్యాచ్‌లో కీలక దశలో ప్రగ్యానంద గుర్రం బోర్డు చివరి మూలకు వెళ్లి తిరిగి సురక్షితంగా బయటపడింది.

దీంతో అతడికి మెటీరియల్ ఆధిక్యం లభించింది. గుకేశ్ దాడి చేసే ప్రయత్నం చేసినప్పటికీ ప్రజ్ఞానంద (Praggnanandhaa) అద్భుతంగా రక్షణ ఆడాడు. ఆ తర్వాత నల్ల పావుల ఆట క్రమంగా బలపడింది. గుకేశ్ దాడి ప్రభావం తగ్గిపోయింది. చివరకు 34వ ఎత్తు తర్వాత పరిస్థితి తనకు అనుకూలంగా లేదని గుర్తించిన గుకేశ్ ఓటమిని అంగీకరించాడు. ఈ విజయంతో ప్రజ్ఞానంద టోర్నీ అగ్రస్థానంలో ఉన్న వెస్లీ సోకు కేవలం అర పాయింట్ దూరంలో నిలిచాడు. చివరి రౌండ్‌లో అతడు జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్‌తో తలపడనున్నాడు.

ఈ టోర్నీలో ఇప్పటివరకు కీమర్ ఒక్క క్లాసికల్ గేమ్ కూడా ఓడిపోలేదు. ఇదే సమయంలో మహిళల విభాగంలో బిబిసారా అస్సౌబాయేవా టైటిల్‌ను ఖాయం చేసుకుంది. తొమ్మిదో రౌండ్‌లో అన్నా ముజిచుక్‌తో డ్రా ఆడిన ఆమె ఛాంపియన్‌గా నిలిచింది. భారత క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్‌కు మాత్రం నిరాశ ఎదురైంది. ఆమె చైనా ఆటగాళి ఝూ జినర్ చేతిలో ఓడిపోయింది. మరో భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి కూడా ఆర్మగెడాన్ గేమ్‌లో జూ వెన్‌జున్ చేతిలో పరాజయం చవిచూసింది.

ప్రస్తుతం మహిళల విభాగంలో దివ్య, హంపి చివరి స్థానాల్లో కొనసాగుతున్నారు. పురుషుల విభాగంలో ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్సెన్‌కు కూడా మరో ఎదురుదెబ్బ తగిలింది. వెస్లీ సోతో జరిగిన ఆర్మగెడాన్ టైబ్రేక్‌లో అతడు ఓడిపోయాడు. మరోవైపు అలిరెజా ఫిరౌజా, విన్సెంట్ కీమర్‌పై ఆర్మగెడాన్ విజయం సాధించాడు. ఇప్పుడు టోర్నీ చివరి రోజు అందరి చూపు టైటిల్ రేసుపైనే ఉంది. ప్రజ్ఞానంద మరో విజయం సాధిస్తాడా, టైటిల్‌ను అందుకుంటాడా అన్నది ఆసక్తికరంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>