Mobile Popup Ad
Mobile Popup Ad

మణుగూరులో గంజాయి నిందితుల అరెస్ట్!

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు (Manuguru) మండలంలోని న్యూ పద్మ గూడెం గ్రామంలోని ఓ ఇంట్లో గంజాయి అమ్ముతున్నారని పోలీసులకు సమాచారం అందింది. మణుగూరు డీఎస్పీ వంగ రవీందర్ రెడ్డి ఆదేశాల మేరకు సీఐ నాగబాబు నేతృత్వంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 1.085 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇంటి యజమానిని విచారించగా గుట్ట మల్లారానికి చెందిన సాయి వద్ద గంజాయి కొనుగోలు చేసి, సత్తుపల్లికి చెందిన సందీప్‌కి అమ్ముతున్నట్లు వివరించాడు. దీంతో సాయి, సందీప్‌పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>