Mobile Popup Ad
Mobile Popup Ad

బాల్య వివాహాల నిరోధం సమిష్టి బాధ్యత: కవ్వంపల్లి సత్యనారాయణ

కలం, కరీంనగర్ బ్యూరో: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈనెల 27 నుండి వచ్చే నెల 2 వరకు పిల్లల సంరక్షణ, భద్రత అనే అంశంపై వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యుక్త వయసు గల బాలికలకు ( స్నేహ గ్రూప్ సభ్యులకు) మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ (MLA Kavvampally Satyanarayana) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్యవివాహాల వల్ల అనేక మానసిక శారీరక సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. బాల్య వివాహం బాలికల హక్కులను హరించడమేనని అన్నారు. యుక్త వయసు రాకముందే గర్భం దాల్చడం వల్ల రక్తహీనత పోషకాహార లోపం లాంటివి తలెత్తుతాయని, తల్లి బిడ్డల ఆరోగ్యానికి ప్రమాదకరమని తెలిపారు.

చిన్న వయసులో వివాహాల ద్వారా మాతృ శిశు మరణాలు సంభవించే అవకాశం ఉందన్నారు. సోషల్ మీడియా ప్రభావంతో కొంతమంది బాలికలు ప్రేమ పేరుతో మోసపోతున్నారని తెలిపారు. తల్లిదండ్రుల పిల్లలను ఎంతో గారాబంగా పెంచుతూ కష్టపడి చదివిస్తున్నారని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత చదువు ఉద్యోగంపై దృష్టి పెట్టాలని తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమాజం బాల్య వివాహాల నిరోధానికి కృషి చేయాలని సూచించారు. బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే 1098 చైల్డ్ హెల్ప్ లైన్ కి సమాచారం ఇవ్వాలన్నారు. నల్సార్ యూనివర్సిటీ కన్సల్టెంట్ డేవిడ్ రాజ్ ఫోక్సో చట్టంపై, డాక్టర్ మధుసూదన్ రెడ్డి బాల్య వివాహాలపై ఎమ్మెల్యే అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు నిరోధిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ వై.సునీల్ రావు, సిడబ్ల్యుసి చైర్ పర్సన్ ధనలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, అడిషనల్ డిఆర్డిఓ రవి, అడిషనల్ డీఎంహెచ్వో సుధా, పోలీస్ ఇన్స్పెక్టర్లు పుల్లయ్య, శ్రీలత, సిడిపిఓ సబిత, డిసిపిఓ పర్వీన్, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>