కేంద్ర, రాష్ట్రాలు ప్రత్యేక నిధులిస్తేనే నగరాభివృద్ధి : గంగుల కమలాకర్

కలం, ​కరీంనగర్: నగరం వేగంగా అభివృద్ధి చెందాలంటే కేవలం నగరపాలక సంస్థ నిధులతోనే సాధ్యం కాదని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తేనే మరింత అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) అన్నారు. నగరంలోని 21వ డివిజన్‌లో మున్సిపల్ సాధారణ నిధులతో రూ.12 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మేయర్ శ్రీనివాస్ కలిసి గంగుల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు వారికి ఘనస్వాగతం పలికి సత్కరించారు. ​అనంతరం కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించిన ఆయన మాట్లాడారు.

గతంలో ఈ ప్రాంతమంతా ఒక గ్రామంగా ఉండేదని, తాను మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో ఇక్కడ కనీస రోడ్లు కూడా లేవని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక నిధులు కేటాయించి, కరీంనగర్ నగరానికి వందల కోట్లు వెచ్చించి సుందరంగా తీర్చిదిద్దామని తెలిపారు. బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులు కరీంనగర్ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించేలా కృషి చేయాలని గంగుల (Gangula Kamalakar) విజ్ఞప్తి చేశారు. రానున్న రెండేళ్లలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, ఆ తర్వాత నగరంలో అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

​ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్, నాయకులు గాదె శ్రీనివాస్, అర్బన్ బ్యాంకు మాజీ డైరెక్టర్ కర్ర సూర్య శేఖర్, మాజీ ఎంపీటీసీ ఉప్పు శ్రీనివాస్, స్థానిక డివిజన్ నాయకులు రత్నాకర్, జీపీ.స్వామి, పటేల్ సుధీర్ రెడ్డి, జీకే యువత సభ్యులు మొగులోజు వెంకట్, తోట కోటేశ్వర్, పటేల్ పొన్నం రాజు, మిడిదొడ్డి నవీన్, సంతోష్, తదితర నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>