డ్రగ్స్‌ కట్టడిపై కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి కీలక ఆదేశాలు

కలం, యాదాద్రి భువనగిరి :  మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, కాలేజీలు, గ్రామాలు, పట్టణాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ (Bhuvanagiri Collector) అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో నిర్వహించిన యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సమీక్ష సమావేశంలో ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లాలో ఇటీవల నమోదైన డ్రగ్స్ కేసులు, పట్టుబడిన మత్తు పదార్థాల వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని పరిశ్రమలు, కంపెనీలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా కళాశాలలు, గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల బాధితుల కుటుంబాలతో పాటు సమాజంపై కూడా తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యంగా యువత డ్రగ్స్‌కు ఆకర్షితులు కాకుండా నిరంతర అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్ మాట్లాడుతూ పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో పనిచేసే వారిపై నిఘా ఉంచడంతో పాటు కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. జిల్లాలోని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి యాదాద్రి భువనగిరి జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ఎక్సైజ్ అధికారి తుక్యా నాయక్, జిల్లా సంక్షేమ అధికారి శ్రీనివాస్, సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>