Mobile Popup Ad
Mobile Popup Ad

పాత‌బ‌స్తీలో రౌడీ షీట‌ర్ వీరంగం.. రోడ్డుపై క‌త్తుల‌తో దాడి

క‌లం, వెబ్ డెస్క్‌: పాత‌బ‌స్తీ (Old City)లో ఓ రౌడీ షీట‌ర్ తల్వార్ల‌తో హ‌ల్చ‌ల్ చేశాడు. రోడ్డు మీద కనిపించిన వారిపై దాడి చేస్తూ భ‌య‌భ్రాంతుల‌కు గురి చేశాడు. వివ‌రాల్లోకి వెళ్తే.. బుధ‌వారం అర్ధ‌రాత్రి పాత‌బ‌స్తీలో ఓ గ్యాంగ్ వార్(Gang War) నేప‌థ్యంలో రౌడీ షీట‌ర్‌ అస‌ద్ ముఠా రెచ్చిపోయింది. రోడ్ల‌ మీద క‌త్తుల‌తో హ‌ల్చ‌ల్ చేస్తూ స్థానికుల‌ను భ‌య‌పెట్టారు. ఓ కిరాణా షాపు య‌జ‌మానిపై దాడికి ప్ర‌య‌త్నించారు. షాపు ఎదుట ఉన్న కొనుగోలుదారుల‌పైనా దాడి చేశారు. షాపు అద్దాలు, ఫ్రిడ్జి ధ్వంసం చేశారు. దీంతో రోడ్డుపై ఉన్న వారు భ‌యంతో ప‌రుగులు పెట్టారు. అనంత‌రం అస‌త్ ముఠా అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. ఇప్ప‌టికే అస‌ద్ ప‌లు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. పోలీసులు అస‌ద్ కోసం గాలింపు చేప‌ట్టారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అక్క‌డి సీసీ కెమెరాలో రికార్డ‌య్యాయి. ఈ వీడియో ఆధారంగా పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Read Also: రోవన్ అట్కిన్సన్ సంచలన నిర్ణయం.. 160 మిలియన్ డాలర్ల విరాళం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>