జాతీయ సామాజిక భద్రతా బోర్డు సభ్యుడిగా గణేష్ రావు

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : జాతీయ సామాజిక భద్రత బోర్డ్ (National Social Security Board) సభ్యుడిగా కే. గణేష్ రావును (Ganesh Rao) నియమిస్తూ భారత ప్రభుత్వం కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ తేది. 28-10-2026 న భారత ప్రభుత్వం గజట్ ను విడుదల చేసింది. ఈ నేపథంలోనే టీయూసీసీ రీజినల్ సెక్రటరీగా కొనసాగుతున్న కే.గణేష్ రావు జాతీయ సామాజిక భద్రతా బోర్డు సభ్యుడిగా అసంఘటిత కార్మికుల హక్కుల కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం జాతీయ స్థాయిలో పనిచేయనున్నారు.

అంతేకాకుండా కార్మికుల హక్కులు, వారి సమస్యల పరిష్కారం కోసం గత 38 సంవత్సరాలుగా పాలమూరు లేబర్ పక్షాన పోరాటం చేస్తున్న కే. గణేష్ రావుకు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు శ్రమశక్తి అవార్డుతో ఆయనను సత్కరించాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి జాతీయస్థాయిలో జాతీయ సామాజిక భద్రతా బోర్డు సభ్యుడుగా కే.గణేష్ రావును నియమించడంపై టీయూసిసి సీనియర్ నాయకులు చాంద్ ఖాన్, జి.ఆంజనేయులు, ఎస్.అబ్రహం, బి.శ్రీధర్, బి.సంపత్ కుమార్ లతో పాటు పలువురు కార్మిక సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>