కలం, వెబ్ డెస్క్ : ఒమన్ తీరానికి సమీపంలో , హర్మూజ్ జలసంధి (Hormuz Strait Attack) వద్ద 14 మంది బారతీయ సిబ్బందితో వెళ్తున్న భారత రవాణా నౌక ‘ఎంఎస్‌వి అల్ జుసుఫీ’ పై డ్రోన్ ద్వారా అనూహ్య దాడి జరిగింది. గుజరాత్‌లోని పోర్బందర్ నుంచి ఖర్జూరాల లోడుతో వెళ్తున్న ఈ నౌకపై దాడి జరగడంతో తీవ్ర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దాడి ధాటికి నౌక దెబ్బతినడంతో సిబ్బంది వెంటనే లైఫ్బోట్ల సహాయంతో నౌకను ఖాళీ చేశారు. అయితే ఈ ప్రమాదంలో గుజరాత్‌కు చెందిన గంధార్ నహీమ్ అజీజ్ అనే నావికుడు తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోగా, మిగిలిన 13 మంది సిబ్బందిని ఒమన్ కోస్ట్ గార్డ్ సురక్షితంగా రక్షించింది.
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య హర్మూజ్ జలసంధి ప్రాంతంలో ఆయిల్ ట్యాంకర్లు, వాణిజ్య నౌకలపై డ్రోన్లు, మైన్లు, మిస్సైల్ దాడులు పెరగడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై భారత కేంద్ర నౌకాయాన మంత్రిత్వ, అలాగే విదేశాంగ శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. బాధితులకు అవసరమైన తక్షణ సహాయం అందించడానికి, మృతి చెందిన నావికుడి భౌతికకాయాన్ని స్వదేశానికి తీసుకురావడానికి ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడి స్థానిక యంత్రాంగంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అలాగే, అంతర్జాతీయ సముద్ర వాణిజ్య మార్గాల్లో దాడులను తక్షణమే నిలిపివేసి దౌత్యపరమైన పరిష్కారం కనుగొనాలని స్పష్టం చేసింది.
Also Read : రోజుల తరబడి ఆందోళన చేస్తారా?: సుప్రీం కోర్టు
Follow Us On: X(Twitter)

