ఏసీబీకి చిక్కిన సదాశివపేట వ్యవసాయ అధికారి

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల వ్యవసాయ అధికారి రమేష్ (Sadashivpet AO Ramesh) ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఎరువుల వ్యాపారి నుంచి ఏవో రమేష్ రూ.30 వేలు లంచం డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా గతేడాది అక్టోబర్ 19న రూ.10 వేలు తీసుకున్నారు. మంగళవారం నాడు మిగిలిన రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతో దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ.20 వేలు లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి హైదరాబాద్‌లోని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టు జడ్జి ఎదుట హాజరుపరచనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

Also Read : ఒమన్ తీరంలో భారత నౌకపై అనుహ్య దాడి.. నావికుడు మృతి!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>