గద్వాల్‌లో గణపయ్య లడ్డూకు లక్షల్లో ధర..

కలం,‌ జోగులాంబ గద్వాల: గద్వాల (Gadwal) మున్సిపాలిటీ పరిధిలోని రెవెన్యూ కాలనీలో వినాయక చవితి వేడుకల్లో భాగంగా శుక్రవారం రాత్రి నిర్వహించిన గణనాథుడి లడ్డూ వేలం పాట (Laddu Auction) ఘనంగా జరిగింది. ఆర్‌వీసీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేలం పాటలో భక్తులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకునేందుకు ఉత్సాహంగా పోటీ పడ్డారు.

15కేజీల, 10కేజీల లడ్డూ ప్రసాదం వేలం పాటలో పలువురు పోటీదారులు భారీగా సవాళ్లు చేయగా, చివరకు 15కేజీల లడ్డూ ప్రసాదాన్ని జీఎన్ఆర్ కంస్ట్రక్షన్ గోపినాథ్ రెడ్డి రూ.3,00,016 కైవసం చేసుకోగ 10కేజీల లడ్డూ ప్రసాదాన్ని గడ్డం పవిత్ర రూ.1,00,016 కైవసం చేసుకున్నారు. గణనాథుడి పవిత్ర ప్రసాదం తమ కుటుంబానికి దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్లు వారు తెలిపారు.

రెవిన్యూ కాలనీలో వినాయక చవితి సందర్భంగా లడ్డూ వేలం పాటకు ఏటా ఆదరణ పెరుగుతూ వస్తోంది. భక్తులు గణనాథుడి లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకోవడాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తుండటంతో ప్రతి ఏడాది వేలం పాటలో పోటీ మరింత పెరుగుతోంది. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, ఆర్‌వీసీ యూత్ సభ్యులు పాల్గొన్నారు‌.

Also Read : ఎల్‌ నినో తీవ్ర ప్రభావం.. ధాన్యం దిగుబడి డౌన్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>