కలం, కరీంనగర్: కరీంనగర్(Karimnagar) పోలీస్ కమిషనరేట్ (Police Commissionerate) కేంద్రంలో గణేష్ నవరాత్రుల సందర్భంగా ప్రతిష్ఠించిన గణనాథుడి నిమజ్జన కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డప్పు చప్పుళ్ల నడుమ గణనాథుడిని భక్తిశ్రద్ధలతో నిమజ్జనానికి సాగనంపారు. పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో భక్తి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణతో పాటు కమిషనరేట్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.

