రైతును పురుగుల మందు తాగమన్న ఎమ్మార్వో!

కలం, మెదక్ బ్యూరో: సిద్ధిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మార్వో (Gajwel MRO) స్వామి తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. తన సమస్యను పరిష్కరించాలని వెళ్లిన ఒక రైతును పట్టుకుని ‘నువ్వు ఇంకా బతికే ఉన్నావా.. పురుగుల మందు తాగలేదా?’ అంటూ అహంకారపూరితంగా మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఎమ్మార్వో వ్యాఖ్యలపై బాధిత రైతు స్పందిస్తూ.. ‘నా బాధ చూస్తే మీకు నవ్వొస్తుందా..?’ అని ప్రశ్నించగా “అవును.. బరాబర్ వస్తుంది” అంటూ వెకిలిగా నవ్వుతుండటం వీడియోలో కనిపిస్తోంది.

స్వామి తీరుపై నెటిజన్లు, ప్రజా సంఘాల నేతలు ఫైర్ అవుతున్నారు. బాధ్యత గల అధికారిగా ఉండి సమస్యను పరిష్కరించకపోగా.. రైతునే పురుగుల మందు తాగాలని చెప్పడం ఎట్టి పరిస్థితుల్లో క్షమించరాని నేరమని కామెంట్ చేస్తున్నారు. ఇది ఆత్మహత్యకు ప్రేరేపించడమేనని.. వెంటనే ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

కేటీఆర్ తీవ్ర ఆగ్రహం…

గజ్వేల్ ఎమ్మార్వో స్వామిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భూమిని కాపాడుకోవాలని కార్యాలయానికి వచ్చిన రైతును పట్టుకుని ఎగతాళి చేసిన తీరు సిగ్గుచేటన్నారు. అన్నం పెట్టే రైతును ఇలాగే అవమానిస్తారా.. తోటి మనిషితో ఈ అధికారి వ్యవహరించిన తీరు చూస్తే.. ఆయన మానసికంగా ఎంతటి అమానవీయ స్థితిలో ఉన్నారని అర్థమవుతోందన్నారు. వెంటనే ఎమ్మార్వోపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>