ప్రభుత్వ విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ రిజ్వాన్ బాషా

కలం,‌ జోగుళాంబ గద్వాల: అర్హులైన విద్యార్థులకు ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చదువుకునే అవకాశం కల్పిస్తుందని గద్వాల కలెక్టర్ (Gadwal Collector) రిజ్వాన్ బాషా షేక్ (Rizwan Basha Shaik) అన్నారు. ఎంపికైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఐడీఓసీ సమావేశపు మందిరంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చదువుకునేందుకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను లక్కీ డిప్ విధానంలో కలెక్టర్ ఎంపిక చేశారు.

నాన్ రెసిడెన్షియల్ ఒకటవ తరగతిలో ప్రవేశాలకు మొత్తం 57 సీట్లు ఉండగా, మొత్తం 265 మంది దరఖాస్తు చేసుకోగా గ్రూప్ 1, 2, 3లకు సంబంధించి మహిళా రిజర్వేషన్స్, జనరల్ కోటాలో నిబంధనల ప్రకారం డిప్ ద్వారా విద్యార్థులను ఎంపిక చేశారు. రెసిడెన్షియల్ ఐదవ తరగతిలో ప్రవేశాలకు మొత్తం 59 సీట్లు ఉండగా గ్రూప్ 1, 2, 3లకు సంబంధించి మొత్తం 310 మంది దరఖాస్తు చేసుకోవడంతో అర్హులైన వారిలో నుంచి డిప్ విధానంలో విద్యార్థులను ఎంపిక చేశారు.

వివిధ గ్రూపులకు సంబంధించి వెయిటింగ్ లిస్టు ప్రాతిపదికన కొంతమంది విద్యార్థులను కూడా డిప్ విధానంలో ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ (Gadwal Collector) ఎంపికైన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి నుషిత, ఏఎస్సీడబ్ల్యూఓ నాగరాజు, సెక్టోరియల్ అధికారి కర్రెప్ప, బీచుపల్లి గురుకుల విద్యాలయ ప్రిన్సిపల్ రామాంజనేయులు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Read Also: శర్వా బ్లడ్ ఫెస్ట్ స్టార్ట్.. ‘భోగి’ షూట్ అప్‌డేట్ వైరల్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>