కలం, సినిమా : టాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘భోగి’ (Bhogi) సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. చిత్రబృందం ప్రకటించిన మేరకు, ఈ చిత్రంలోని అత్యంత కీలకమైన క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌ను భారీ స్థాయిలో తెరకెక్కించనున్నారు. ఈ హై-ఆక్టేన్ ఎమోషనల్ యాక్షన్ క్లైమాక్స్ కోసం ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్‌లో 20 రోజులపాటు షూటింగ్ జరగనుంది. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ దిలీప్ మాస్టర్ ఆధ్వర్యంలో ఈ సన్నివేశాలు చిత్రీకరించబడనున్నాయి.
ఈ క్లైమాక్స్‌లో హీరో శర్వానంద్ (Sharwanand) ఇప్పటివరకు చూడని అత్యంత ఇన్‌టెన్స్ అవతార్‌లో కనిపించనున్నారని చిత్రబృందం తెలిపింది. ‘శర్వా సంపత్ బ్లడ్ ఫెస్ట్’గా ఈ సీక్వెన్స్ ఉండబోతుందని హింట్ ఇచ్చారు. దీంతో అభిమానులలో ఆసక్తి మరింత పెరిగింది. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘భోగి’ చిత్రం 2026 ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ అప్డేట్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

