Mobile Popup Ad
Mobile Popup Ad

టీజీ ఐసెట్ ఫలితాలు విడుదల

కలం, నల్లగొండ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG ICET) ఫలితాలు శుక్రవారం అధికారికంగా విడుదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఈ పరీక్షల మూల్యాంకన ప్రక్రియను, ఫలితాల రూపకల్పనను విజయవంతంగా పూర్తి చేసింది. జూన్ 12వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని కార్యాలయ కమిటీ హాల్‌లో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలక్రిష్ణారెడ్డి, మహాత్మా గాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, టీజీ ఐసెట్-2026 కన్వీనర్ ప్రొఫెసర్ అలువాల రవి కలిసి సంయుక్తంగా ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు, సెక్రటరీతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అమ్మాయిలదే పైచేయి..

ఈ ఏడాది మే 13, 14 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 69 పరీక్షా కేంద్రాల్లో మొత్తం మూడు సెషన్లలో అత్యంత పారదర్శకంగా, క్రమశిక్షణతో కూడిన వాతావరణంలో ఈ పరీక్షలు (TG ICET) జరిగాయి. పరీక్షల నిర్వహణలో సాంకేతిక సిబ్బంది, అబ్జర్వర్లు, అధికారులు సమన్వయంతో వ్యవహరించి పరీక్షలను విజయవంతం చేశారు. మొత్తం 56,206 మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో 51,146 మంది పరీక్షకు హాజరయ్యారు. హాజరైన వారిలో మొత్తం 46,654 మంది అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు అర్హత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 91.22% ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఫలితాల విశ్లేషణను పరిశీలిస్తే పురుషుల కంటే మహిళా అభ్యర్థులే ఎక్కువ సంఖ్యలో అర్హత సాధించారు.

పరీక్షకు హాజరైన పురుషులు 23,353 మంది కాగా, వారిలో 21,191 మంది (90.74%) అర్హత సాధించారు. పరీక్షకు హాజరైన మహిళలు 27,793 మంది కాగా, వారిలో 25,463 మంది (91.62%) అర్హత సాధించి పైచేయి సాధించారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ https://icet.tgche.ac.in/ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ఫలితాల ఫోల్డర్‌లో అభ్యర్థి పేరు, హాల్ టికెట్ నంబర్, సెక్షన్ల వారీగా నార్మలైజ్ చేసిన మార్కులు, మొత్తం మార్కులు, అర్హత సాధించిన స్థితి వివరాలు పొందుపరిచారు. ఈ ఫోల్డర్‌ను ఓపెన్ చేయడానికి అవసరమైన పాస్‌వర్డ్‌ను ప్రెస్ మీట్ సందర్భంగా అధికారులు వెల్లడించారు.

Read Also: కేటీఆర్ సైగలకు కిషన్ రెడ్డి డ్యాన్స్: సీఎం రేవంత్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>