మంత్రి ప్రసంగం కోసం నిలిచిపోయిన శవయాత్ర

కలం, వెబ్​ డెస్క్​ : జగిత్యాల జిల్లా కోరుట్ల (Korutla)లో పోలీసుల వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. జిల్లా ఇంచార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటనలో భాగంగా ఆయన ప్రసంగం ముగిసేవరకు ఒక శవయాత్రను పోలీసులు అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది. మంత్రి స్పీచ్ పూర్తయ్యే వరకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు రోడ్డుపైనే మృతదేహంతో సుమారు అరగంట పాటు నిరీక్షించాల్సి వచ్చింది.

పోలీసుల ఈ అత్యుత్సాహం పట్ల అక్కడున్న ప్రజలు మండిపడ్డారు. అంతిమ యాత్రను కూడా రాజకీయ కారణాలతో నిలిపివేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. చివరకు మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకోవడంతో, పోలీసులు అరగంట తర్వాత శవయాత్రకు అనుమతిని ఇచ్చారు.

Read Also: పంచుదాం అనుకున్నారు.. పట్టుబడ్డారు

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>