సుదనపల్లిలో దారుణం.. కొడుకు చేతిలో తండ్రి హత్య

కలం, మహబూబాబాద్: సీరోలు మండలం సుదనపల్లి (Sudhanapally) గ్రామంలో మంగళవారం దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో తండ్రిని కొడుకు హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లకుమల్ల వెంకన్న మద్యం సేవించి భార్యను తరచూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, ఈ విషయాన్ని ఆమె తన కుమారుడు లకుమల సునీల్‌కు చెప్పింది.

ఈ క్రమంలో తల్లి ఇంట్లో లేని సమయంలో సునీల్ ఇంటికి వచ్చి తండ్రిని ప్రశ్నించాడు. మాటామాటా పెరగడంతో కర్రతో పాటు ట్యూబ్‌లైట్ ఐరన్ ఫ్రేమ్‌తో వెంకన్నపై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన వెంకన్న మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై మరిపెడ సీఐ పవన్‌కుమార్ దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>