ఎన్‌ఎంఎంఎస్ పరీక్షకు మహబూబ్‌నగర్ లో ఉచిత శిక్షణ

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : ‘నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్’ (ఎన్ఎంఎంఎస్) ప్రధాన పరీక్షకు సన్నద్ధమయ్యే విద్యార్థుల కోసం ఈ నెల 11న ఉచిత స్క్రీనింగ్ పరీక్ష (Free NMMS Screening Test) నిర్వహించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న పేద విద్యార్థులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రోత్సాహంతో ‘మహబూబ్‌నగర్ ఫస్ట్’, ‘వందేమాతరం ఫౌండేషన్’ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. ఈ మేరకు మహబూబ్‌నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, వందేమాతరం ఫౌండేషన్ జిల్లా బాధ్యులు తూర్పు రవీందర్ రెడ్డి సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

నవంబర్ 1న జరగనున్న ప్రధాన పరీక్షను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు ముందస్తు శిక్షణ కల్పించడమే లక్ష్యంగా స్క్రీనింగ్ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష (Free NMMS Screening Test) లో ప్రతిభ కనబరిచిన మొదటి 120 మంది విద్యార్థులకు గొల్లపల్లిలోని లలితాంబిక తపోవన్ దేవాలయం సహకారంతో అక్టోబర్ 22 నుండి 31 వరకు 10 రోజుల పాటు ఉచిత భోజన, వసతితో కూడిన రెసిడెన్షియల్ కోచింగ్ అందించనున్నారు. అలాగే మెరిట్ సాధించిన మరో 250 మంది విద్యార్థులకు అక్టోబర్ 12 నుండి 18 వరకు అనుభవజ్ఞులైన అధ్యాపకులతో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నారు.

స్క్రీనింగ్ పరీక్ష అక్టోబర్ 11న ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద గల మోడ్రన్ హై స్కూల్ ప్రాంగణంలో జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని నిర్వాహకులు కోరారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చొరవ తీసుకుని విద్యార్థులను స్క్రీనింగ్ పరీక్షకు హాజరయ్యేలా ప్రోత్సహించాలని వారు విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>