Mobile Popup Ad
Mobile Popup Ad

ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన

కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం నడిపల్లిలో శ్రీరామ ఆసుపత్రి (డిచ్ పల్లి) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి (Free Medical Camp) అనూహ్య స్పందన లభించింది. హెల్త్ క్యాంపును నడిపల్లి సర్పంచ్ అశ్విని ప్రారంభించగా.. గ్రామస్తులు వృద్ధులు మహిళలు భారీగా హాజరై ఉచిత వైద్య సేవలు సద్వినియోగం చేసుకున్నారు. షుగర్ బీపీ పేషెంట్లకు మెడిసిన్స్ కూడా ఉచితంగా పంపిణీ చేశారు. జ్వరాలు నొప్పుల బాధితులు వివిధ రోగాలకు సైతం చెకప్ చేయించుకున్నారు.

డాక్టర్ విష్ణు పేషెంట్లకు పరీక్షలు నిర్వహించగా.. శ్రీరామ ఆసుపత్రి యాజమాన్యం ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రతి బుధవారం డిచ్ పల్లి లోని శ్రీరామ ఆసుపత్రిలో ఫ్రీ ఓపీ సౌకర్యం ఉంటుందని ఫ్రీగా చెకప్ చేసుకోవచ్చని శ్రీరామ ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. ఈ సందర్భంగా నడి పల్లి సర్పంచ్ అశ్విని మాట్లాడుతూ.. ఉచిత వైద్య శిబిరం నిర్వహించి పేదలకు ఉచితంగా మందులు పంపిణీ చేయడం గొప్ప విషయం అని ఆసుపత్రి నిర్వహకులను అభినందించారు. ప్రతి బుధవారం కూడా డిచ్ పల్లిలోని శ్రీరామ ఆసుపత్రిలో ఉచిత ఓపీ సేవలు నిర్వహిస్తున్నందునా అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, లింగోజీ ల్యాబ్ ఇన్ ఛార్జ్ మహేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>