తమిళనాడు రాజకీయాలతో ఏపీ రాజకీయాలు పోల్చడం అవివేకం : మాజీ మంత్రి

కలం, వెబ్ డెస్క్ : తమిళనాడులో టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చిన వేళ జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో విజయ్ సింగిల్ గా గెలిచాడు.. ఏపీలో పవన్ కళ్యాణ్ కూడా అలాగే గెలిచేవాడు కాదా? అని కొందరు అనవసరపు మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. తమిళ రాజకీయాలతో ఏపీ రాజకీయాలు పోల్చడం అవివేకం అని వ్యాఖ్యానించారు. అక్కడి పరిస్థితులకు ఏపీలోని పరిస్థితులకు చాలా తేడా ఉంటుందని స్పష్టం చేశారు.

జనసేనలో తనకు అన్యాయం జరుగుతుందని వైసీపీ శ్రేణులు చేస్తున్న ఆరోపణలను బాలినేని శ్రీనివాసరెడ్డి ఖండించారు. వైసీపీలో అన్యాయం జరుగుతందనే జనసేనలోకి వచ్చానని వెల్లడించారు. జనసేనలో ప్రాధ్యానత ఉంది కాబట్టి కొనసాగుతున్నానని పేర్కొన్నారు. తనపై వైసీనీ తప్పుడు ప్రచారం చేయడం తగదని సూచించారు. అయినా జనసేనలో తనకు అన్యాయం జరిగితే వైసీపీకి బాధేంటి అని మండిపడ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>