హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. తప్పిన పెను ప్రమాదం

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని శంషాబాద్‌ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఒక విమానానికి పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరేందుకు టేకాఫ్ అయిన కొద్దిసేపటికే Fly91 ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అయితే అప్రమత్తమైన పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు సమచారం అందించారు. ఈ క్రమంలోనే పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ (Flight Landing) చేశారు. దీంతో ఒక పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.

ఈ ఘటన సమయంలో విమానంలో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులందరూ సురక్షితంగా కిందకు దిగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక విమానం ల్యాండ్ అయిన తర్వాత ఇంజనీరింగ్ టీమ్ సమస్యను పరిశీలిస్తోంది. కాగా, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా Fly91 ఎయిర్‌లైన్స్ యాజమాన్యం వెంటనే స్పందించి, వారిని మరో ప్రత్యామ్నాయ విమానంలో విజయవాడకు సురక్షితంగా పంపించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>