గంజాయి స్మగ్లర్లకు 20 ఏళ్ల జైలు శిక్ష..!

కలం, వరంగల్ బ్యూరో: హనుమకొండ (Hanumakonda) జిల్లా ఆత్మకూరులో గంజాయి స్మగ్లింగ్‌ (Ganja Smuggling)కు పాల్పడిన ఐదుగురు నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ హనుమకొండ మొదటి అదనపు జిల్లా కోర్ట్ న్యాయమూర్తి బి.అపర్ణాదేవి బుధవారం తీర్పు వెలువ‌రించారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు శాయంపేట, ఆత్మకూరు మండలాలకు చెందిన పావురాల వెంకటేష్, అబ్బోజు వెంకటేష్, పరుపల్లి కార్తీక్, అనంతుల సాంబయ్య, కొక్కరకొండ చంద్రయ్యలు సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీరు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ప్రాంతంలో పెద్ద మొత్తంలో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి, ఎక్కువగా మహారాష్ట్రకు తీసుకెళ్లి విక్రయించే వారు.

ఈ క్రమంలో రహస్యంగా కారులో స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను ఆత్మకూరు పోలీసులు చౌలపల్లి గ్రామ శివారు ప్రాంతంలో అరెస్ట్ చేశారు. వీరి నుండి 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అప్పటి ఆత్మకూరు ఇన్స్పెక్టర్ రాజలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేరం రుజువు కావడంతో న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి. రాజమల్లారెడ్డి వాదించగా, ప్రస్తుతం ఇన్స్ స్పెక్టర్ ఆర్.సంతోష్, కోర్టు లైజన్ మహిళా ఆఫీసర్ కె. పరమేశ్వరి, కానిస్టేబుల్ ఆర్. ఉమేష్ పలువురు సాక్షులను కోర్టులో హాజరుపర్చారు.

Read Also: లవర్​ మోజులో.. భర్తను కడతేర్చిన భార్య!

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>