కలం, వరంగల్ బ్యూరో : వరంగల్ (Warangal) పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని చైన్ స్నాచింగ్ చోరీలకు పాల్పడుతున్న చైన్ స్నాచర్లను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వివరాలను సీపీ సన్ ప్రీత్ సింగ్ బుధవారం మీడియా కు వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇద్దరిని వరంగల్ సిసిఎస్, హనుమకొండ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. పట్టుబడిన నిందితుల నుండి పోలీసులు రూ.15 లక్షల 20 వేల విలువగల 95 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు ఒక ద్వి చక్ర వాహనం, రెండు సెల్ ఫోన్ల ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read Also: లవర్ మోజులో.. భర్తను కడతేర్చిన భార్య!
Follow Us On: Sharechat

