ఆదిభట్ల గౌరా ఏరోస్పేస్‌లో భారీ అగ్ని ప్రమాదం

కలం, వెబ్‌డెస్క్: రంగారెడ్డి (Ranga Reddy) జిల్లాలో మరో అగ్ని ప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. ఆదిభట్ల (Adibatla) పోలీస్ స్టేషన్ పరిధిలోని నాదర్‌గుల్ సమీపంలో ఉన్న గౌరా ఏరోస్పేస్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్‌లో గురువారం ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. యంత్రాలను ఆన్ చేసిన సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయిన కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.

ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో కంపెనీలో ఉద్యోగులు లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>