epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

రాహుల్, సోనియాపై ఎఫ్ఐఆర్

నేషనల్‌ హెరాల్డ్‌ కేసు(National Herald Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీపై ఢిల్లీ ఎకనామిక్‌ ఆఫెన్సెస్‌ వింగ్‌ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) అందించిన వివరాల ఆధారంగా సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీతోపాటు మరో ఆరుగురిపై నేరపూరిత కుట్ర, అక్రమ ఆర్థిక లావాదేవీలు, అనుచిత లబ్ధి పొందేందుకు చేసిన ప్రయత్నాలపై కేసులు నమోదు చేశారు.

ఈ కేసులో సోనియాగాంధీ(Sonia Gandhi), రాహుల్‌ గాంధీ(Rahul Gandhi), మోతీలాల్‌ వోరా, ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌, సుమన్‌ దూబే, శ్యామ్‌ పిట్రోడా వంటి నాయకులు ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీరందరూ కలిసి యంగ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ ఆస్తుల స్వాధీనపరచుకోవడంలో కుట్రపూరితంగా వ్యవహరించారని ఈడీ ఆరోపిస్తోంది. రూ.50 లక్షల వంటి చిన్న మొత్తాన్ని చెల్లించి… ఏజేఎల్‌కు చెందిన సుమారు రూ.2 వేల కోట్ల విలువైన ఆస్తులపై యంగ్‌ ఇండియా హక్కులు పొందిందని అభియోగపత్రంలో పేర్కొంది. ఈ వ్యవహారంలో ఆస్తుల నిజమైన విలువను దాచిపెట్టి అక్రమ లాభాలు పొందే ప్రయత్నం జరిగినట్లు విచారణ సంస్థల ప్రాథమిక నివేదికల్లో నమోదైందని సమాచారం.

అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్) ద్వారా నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక ప్రచురణ జరుగుతోంది. ఈ సంస్థకు కాంగ్రెస్‌ పార్టీ గతంలో ఆ సంస్థకు సుమారు రూ.90 కోట్ల రుణం ఇచ్చి ఆ సంస్థను ఆధీనంలోకి తెచ్చుకున్నది. తర్వాత యంగ్ ఇండియా అనే సంస్థ కాంగ్రెస్ పార్టీకి రూ. 50 లక్షలు మాత్రమే చెల్లించి ఈ సంస్థను సొంతం చేసుకున్నది. ఈ యంగ్ ఇండియా సొంస్థలో మెజార్టీ వాటాలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి ఉండటం గమనార్హం. అంతేకాదు, వివిధ వ్యాపారవేత్తలకు, నేతలకు పార్టీ టికెట్లు కల్పిస్తామని, పదవులు ఇస్తామని, వ్యాపారాలకు రక్షణ కల్పిస్తామని చెప్పి… పార్టీ సీనియర్‌ నేతల ద్వారా అక్రమార్జనకు పాల్పడ్డట్లుగా కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ పేర్కొంది. ఈ కేసులో నిందితుల జాబితాలో ఉన్న మోతీలాల్‌ వోరా 2020లో, ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌ 2021లో మృతి చెందారు. అయినప్పటికీ, వారి పాత్రపై విచారణ సంస్థలు పత్రాలు, గత లావాదేవీలు, డైరెక్టర్‌ పదవీకాలం వంటి అంశాలను పరిశీలిస్తున్నాయి. ఢిల్లీ ఈవోడబ్ల్యూ నమోదు చేసిన తాజా ఎఫ్‌ఐఆర్‌తో నేషనల్‌ హెరాల్డ్‌ కేసు(National Herald Case) మళ్లీ హాట్‌టాపిక్‌గా మారింది. ఈ కేసులో ఎటువంటి పరిణామాలు జరుగుతాయో వేచి చూడాలి.

Read Also: స్థానిక ఎన్నికల్లో భారీగా నామినేషన్లు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>