కాల్వ లక్ష్మీనరసింహుని సేవలో ‘రామ్-లక్ష్మణ్’

కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ (Dilawarpur) మండలం కాల్వ గ్రామంలోని సుప్రసిద్ధ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ప్రముఖ టాలీవుడ్ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్​ (Fight Masters Ram Lakshman)లు బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు.

ఆలయానికి చేరుకున్న రామ్ లక్ష్మణులకు ఆలయ పూజారులు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ విశిష్టత, చారిత్రక ప్రాశస్త్యాన్ని పూజారులు వారికి వివరించారు. ఈ సందర్భంగా రామ్ లక్ష్మణులు మాట్లాడుతూ.. ఎంతో పురాతనమైన, ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>