Mobile Popup Ad
Mobile Popup Ad

తీవ్ర విషాదం.. కూతురు పెళ్లి రోజే తండ్రి ఆత్మహత్య

కలం, వెబ్ డెస్క్: నిజామాబాద్ (Nizamabad) జిల్లా నవీపేట్ మండలం నందిగామలో మంగళవారం తీవ్ర విషాదం నెలకొంది. కూతురు పెళ్లి రోజే తండ్రి ఆత్మహత్య (Father Suicide) చేసుకోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడు మేకల కాపరి దేవన్న (51)గా గుర్తించారు. తన కూతురు ప్రవళిక వివాహాన్ని తండ్రి దేవన్న ఘనంగా జరిపించాడు. ఆడపిల్ల పెళ్లి ఖర్చుల కోసం తాను పెంచుకుంటున్న మేకలను దేవన్న విక్రయించాడు. తనకు జీవనాధారమై.. తన ఇంటి కుటుంబ సభ్యుల్లా చూసుకుంటున్న మేకలు లేకపోవడంతో దిగ్బ్రాంతికి గురయ్యాడు. మందలో మేకల సంఖ్య తగ్గడంతో దేవన్న తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే మద్యం సేవించి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. దేవన్న మృతితో పెళ్లి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Read Also: అషు రెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్.. వాయిస్ మెసేజ్ వైరల్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>