Mobile Popup Ad
Mobile Popup Ad

పారిశ్రామిక హబ్‌గా మిర్యాలగూడ: మంత్రి కోమటిరెడ్డి

కలం, మిర్యాలగూడ : మిర్యాలగూడను ప్రధాన పారిశ్రామిక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy) తెలిపారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేవంలో మంత్రి మాట్లాడారు. భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో భాగంగా హైస్పీడ్ ట్రైన్లు, నేషనల్ హైవేలు, డ్రై పోర్ట్, గ్రీన్ ఫీల్డ్ హైవేల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమైనట్లు తెలిపారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో రూ.500 కోట్లతో ట్రైన్ హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన డీపీఆర్ ఈ ఏడాది నవంబర్ నాటికి పూర్తవుతుందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలు కేవలం రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధి నిధుల కోసమేనని అన్నారు. నేషనల్ హైవేపై నిర్మించాల్సిన ఫ్లైఓవర్ పనుల గురించి ఇప్పటికే కాంట్రాక్టర్లతో చర్చలు జరిపామని, త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు.​

హైవేపై ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, తక్షణమే రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.​ కేంద్ర ప్రభుత్వానికి కూడా అధికారికంగా లేఖ రాశామని, జాతీయ రహదారిపై ఫ్లై ఓవర్ల నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని చెప్పారు. హరీష్ రావు, కేటీఆర్ పనిలేక ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలా బలంగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో కూడా జిల్లాలోని 12 స్థానాలను క్లీన్ స్వీప్ చేస్తామని మంత్రి (Minister Komatireddy) ధీమా వ్యక్తం చేశారు.​ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని అన్నారు. సమావేశంలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాస నేత తదితరులు పాల్గొన్నారు.

Read Also: అయిదు కొత్త ఎయిర్‌పోర్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>