వర్షాల కోసం రైతుల ప్రత్యేక పూజలు.. దేవతామూర్తులకు జలాభిషేకం

కలం, జోగుళాంబ గద్వాల: వానాకాలం సీజన్‌ ప్రారంభమై 35 రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు వర్షాలు కురవడం లేదు. దీంతో వర్షాలు సమృద్ధిగా కురవాలని రైతులు సోమవారం పలుచోట్ల గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లా మల్దకల్ మండలం బిజ్వారం రైతులు ఎద్దుల బండ్ల‌ మీద గద్వాలలోని నది అగ్రహారం వద్ద ఉన్న కృష్ణానది వద్దకు తరలివచ్చారు.

గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నదీ జలాలను బిందెలలో నింపుకొని ఎద్దుల బండ్ల మీద ఊరేగింపుగా బిజ్వారం గ్రామానికి చేరుకుని పరమశివుని, దేవతామూర్తుల‌ విగ్రహాలకు జలాభిషేకాలు చేశారు. అంతకుముందు గ్రామాల్లో కృష్ణానదీ జలాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు ఆ వరుణ దేవుడిని వేడుకుంటూ సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు.

Read Also: గులాబీ తోటలో బావబామ్మర్దుల పొలిటికల్ ఫైట్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>