కలం, నిజామాబాద్ బ్యూరో : పొలం దున్నతున్న ఓ రైతు ట్రాక్టర్ కిందపడి చనిపోయిన ఘటన నిజామాబాద్ (Nizamabad) జిల్లా ఎల్లారెడ్డి మండలం మిషన్ పల్లిలో చోటుచేసుకుంది. యాసంగి నాట్లు ఊపందుకోవడంతో గ్రామానికి బోండ్ల శ్రీను తన పొలంలో ట్రాక్టర్ తో దున్నుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు కిందపడడతో ట్రాక్టర్ మీది నుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో శ్రీను మరణించాడు. పొలంలో ట్రాక్టర్ దానికదే తిరుగుతోందని చుట్టుపక్కల పొలాల్లో ఉన్న వారు గమనించి వెళ్లి చూడగా రైతు శ్రీను అప్పటికే చనిపోయాడు. సమాచారాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, గుండెపోటుతో రైతు మరణించినట్లు తెలుస్తోంది.


