epaper
Wednesday, March 4, 2026
epaper

బిస్కెట్ ఆశచూపి బాలికపై లైంగిక దాడి.. వృద్ధుడికి దేహశుద్ధి

కలం, ఖమ్మం బ్యూరో: ఎన్ని కఠిన చట్టాలు అమలు చేస్తున్నా లైంగిక దాడులకు అడ్డకట్ట పడటం లేదు. పిల్లల నుంచి పెద్దల వరకు లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఓ కామాంధుడు బాలికకు బిస్కెట్ ఆశ చూపి లైంగిక దాడికి యత్నించిన ఘటన జరిగింది. ఖమ్మం (Khammam) జిల్లా ఏనుకూరు మండలానికి చెందిన దాసరి వీరభద్రం అనే 63 ఏళ్ల వృద్ధుడు ఓ బాలికకు బిస్కెట్ ఆశ చూపాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. దీనిని గమనించిన స్థానికులు నిందితుడిని పట్టుకొని చితకాబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఏనుకూరు ఎస్సై సంధ్య వృద్ధుడిపై ఫోక్సో (POCSO) కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!