కలం, సినిమా : కన్నడ స్టార్ హీరోయిన్ రచితా రామ్ (Rachita Ram)కు తన పుట్టినరోజు వేడుకల్లో ఓ వింత అనుభవం ఎదురైంది. అక్టోబర్ 3న తన బర్త్డే సందర్భంగా ఇంటి వద్దకు వచ్చిన అభిమానులను కలిసి, వారితో సెల్ఫీలు ఇస్తుండగా ఈ ఘటన జరిగింది.
ఒక యువకుడు ఆమెతో సెల్ఫీ దిగిన వెంటనే, ఊహించని రీతిలో ఆమె రెండు బుగ్గలను గిల్లాడు. ఈ అనూహ్య చర్యతో రచితా రామ్ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అయినప్పటికీ, ఏమాత్రం అసహనం చూపకుండా వెంటనే తేరుకుని, చిరునవ్వులు చిందిస్తూ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

