మహబూబ్‌నగర్ జిల్లాలో విషాదం.. ఇద్దరు కుమార్తెలతో కలిసి తల్లి సూసైడ్

కలం, వెబ్ డెస్క్: మహబూబ్‌నగర్ (Mahbubnagar) జిల్లా భూత్పూర్ మండలం ఎల్కిచర్లలో దారుణం జరిగింది. బోరు బావి వివాదం నిండు సంసారంలో తీరని విషాదాన్ని నింపింది. పొలంలో ఒకచోట బోరు వేసినా నీళ్లు పడకపోవడంతో, మరో బోరు వేయవద్దని భార్య జంగమ్మ తన భర్తను వారించింది. అయితే, భర్త ఆమె మాట వినకుండా మొండిగా ప్రవర్తించాడు. తీవ్ర మనస్తాపానికి గురైన జంగమ్మ.. తన ఇద్దరు కుమార్తెలు జ్యోతి (14), శైలజ (12) లతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య (Suicide) చేసుకుంది. ఈ ప్రమాద సమయంలో బాలుడు జశ్వంత్ కూడా బావిలోకి దూకినప్పటికీ, అదృష్టవశాత్తూ చెట్టు వేర్లను పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. కళ్లముందే ముగ్గురు కుటుంబ సభ్యులు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read Also: వేసవిలో చర్మ సౌందర్యం కోసం ఈ జ్యూస్ తాగండి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>