కలం మెదక్ బ్యూరో: రాష్ట్రంలో రైతులకు కేవలం 12 గంటల విద్యుత్ మాత్రమే సరఫరా అవుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. గత బీఆర్ఎస్ పాలనలో 24 గంటల విద్యుత్ నిరంతరాయంగా సరఫరా చేసేవాళ్లమని చెప్పారు. ప్రస్తుతం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని ఆరోపించారు. లైన్ బ్రేకింగ్, ఎల్‌సి పేరిట అంతరాయం ఏర్పడుతోందని హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం దిగ్వాల్ సబ్‌స్టేషన్‌ను అకస్మికంగా సందర్శించి, లాగ్‌బుక్స్ రికార్డులను మాజీ మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నాణ్యమైన విద్యుత్ సరఫరా లేక రైతుల పంటలు ఎండిపోతున్నాయని, విద్యుత్ సబ్‌స్టేషన్ లాగ్‌బుక్‌లో సాయంత్రం 4 గంటలకు త్రీ ఫేస్ కరెంటు తీసేస్తే తెల్లారి 3 గంటలకు ఇస్తున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం మాత్రం 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు పేర్కొనడం ఎంత వరకు సమంజసమని హరీశ్ రావు (Harish Rao) ప్రశ్నించారు. బ్యాంకులను, ఆర్ధిక సంస్థలను మోసం చేయడానికి కొత్త డిస్కమ్‌ను ఏర్పాటు చేస్తున్నారాని, ఉన్న రెండు డిస్కమ్‌లను 55 వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి, డిస్కమ్‌లను నష్టాలపాలు చేసి కొత్త డిస్కమ్ ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో వేలాది కొత్త విద్యుత్ కనెక్షన్‌లు పెండింగ్‌లో ఉన్నాయని, స్టోర్‌లలో మెటీరియల్ లేదని, కాలిన ట్రాన్స్‌ఫార్మర్ల విషయంలో రైతులపై భారం మోపుతున్నారని, ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని పేర్కొన్నారు.
Read Also: మోనాలిసాకు బిగ్ షాక్.. కేరళలో పోలీస్ కేసు..!
Follow Us On: Facebook

