కలం, నల్లగొండ బ్యూరో : యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లాలో ఓ దోపిడి దొంగ డాక్టర్ అవతారం ఎత్తాడు. సంతానం లేని దంపతులను టార్గెట్‌గా చేసుకొని బంగారంతో ఉడాయించాడు. ఈ ఘటన భూదాన్ పోచంపల్లి (Bhoodan Pochampally)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భూదాన్ పోచంపల్లిలో ఓ దోపిడి దొంగ డాక్టర్ అవతారమెత్తాడు. సంతానం లేని దంపతులే టార్గెట్‌గా దోపిడికి పాల్పడుతున్నాడు. భూదాన్ పోచంపల్లిలోని ఓ సంతానం లేని దంపతుల ఇంట్లోకి చొరబడి తాను ఓ డాక్టర్ అంటూ పరిచయం చేసుకున్నాడు.
సంతానం లేని దంపతులకు లిక్విడ్ ట్రీట్మెంట్ చేస్తే సంతానం కలుగుతుందని నమ్మించాడు. అది దంపతులు నమ్మడంతో మెడపై ఉన్న బంగారం తీయమని చెప్పి దంపతులకు ఒళ్లంతా లిక్విడ్ పోశాడు. కొద్దిసేపటి తర్వాత లిక్విడ్ పోయేలా స్నానం చేసి రావాలని చెప్పాడు. అది నమ్మిన దంపతులు బంగారం అక్కడే ఉంచి స్నానానికి వెళ్లిపోయారు. దీంతో దోపిడి దొంగ ఆ బంగారంతో పరారయ్యాడు. స్నానం చేసి వచ్చిన తర్వాత చూస్తే దోపిడి దొంగ, బంగారం కనిపించకపోవడంతో సదరు బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.
Read Also: అందుకే రేవంత్ రెడ్డి మెదక్ రాలేదు: హరీశ్ రావు
Follow Us On: Youtube


