Mobile Popup Ad
Mobile Popup Ad

నకిలీ నోట్ల చలామణి.. ఎనిమిది మంది అరెస్ట్!

కలం, వరంగల్ బ్యూరో: నకిలీ నోట్ల చలామణి గుట్టును పోలీసులు రట్టు చేశారు. నకిలీ నోట్లను తయారుచేసి (ప్రింట్ తీసి) మార్కెట్లో చలామణి చేస్తున్న ఎనిమిది మంది వ్యక్తులను వరంగల్ (Warangal) టాస్క్‌ఫోర్స్‌, నర్సంపేట పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. నిందితుల నుండి నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా నగదు రూ.1,48,000 లు, సుమారు రూ.28 లక్షల విలువ గల ల్యాప్ టాప్‌లు, ప్రింటర్లు, 13 సెల్‌ఫోన్లు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ అంకిత్ కుమార్ తెలిపారు.

కాగా, తెలుగు రాష్ట్రాల్లో నకిలీ నోట్ల చలామణి ఆందోళనకరంగా పెరిగింది. ముఠాలు ప్రధానంగా పెట్రోల్ బంకులు, కిరాణా షాపులు, చిన్న చిన్న వ్యాపారులను టార్గెట్ చేస్తే నకిలీ నోట్లను చలామణి చేస్తున్నాయి. నకిలీ నోట్ల చలామణి పెరిగిందని.. వ్యాపారులు, ప్రజలు ఆర్థిక లావా దేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Read Also: క్యూట్ వీడియో.. పెంగ్విన్ నడకను ఎక్కిరించిన కుక్క!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>