కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రజావాణిలో అర్జిదారుల నుండి స్వీకరించిన దరఖాస్తుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Collector Khushboo Gupta) అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయం సమావేశం మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి హరిప్రియతో జిల్లా కలెక్టర్ కలిసి దరఖాస్తులను (Prajavani Grievances) స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అర్జిదారుల సమస్యలను సావధానంగా విన్నారు. వారి సమస్యలను పరిష్కరించడానికి జిల్లా యంత్రాంగం తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటుందని వారికి భరోసా ఇచ్చారు.ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను అధికారులు నిశితంగా పరిశీలించి, సమస్యను అర్థం చేసుకొని పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎట్టి పరిస్థితులలో అర్జిదారుల దరఖాస్తులను పెండింగ్ లో ఉంచరాదని, నిర్దేశించిన సమయంలో పరిష్కరించాలని అధికారులను ఆమె ఆదేశించారు. ప్రజావాణిలో రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీ రాజ్, జిల్లా సంక్షేమం, భూ-సర్వే రికార్డులు, గృహ నిర్మాణం, రోడ్డు రవాణా, పోలీస్, విద్య, వైద్యం, గ్రామీణ అభివృద్ధి తదితర శాఖలకు సంబంధించిన మొత్తం 116 వినతులను అధికారులు నమోదు చేసుకున్నారు.
ఆ వివరాలను మే 10లోపు పంపించాలి: కలెక్టర్
ప్రజావాణి అనంతరం కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Khushboo Gupta) జిల్లా అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కారుణ్య నియామకాల (Compassionate Appointments)కు సంబంధించిన ఖాళీ పోస్టుల వివరాలను అన్ని శాఖల అధికారులు తమ తమ శాఖల్లో ఉన్న ఆఫీస్ సబార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఖాళీ పోస్టుల వివరాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కేటగిరీల రోస్టర్ వారిగా నిర్ణీత ఫార్మాట్ లో మే 10లోగా కలెక్టర్ కార్యాలయం పరిపాలన అధికారికి సమర్పించాలని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సహచర ఉద్యోగులు ఏదైనా కారణాల వల్ల మరణించిన సందర్భంలో వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం కారుణ్య నియామకాల ద్వారా కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం కల్పిస్తున్నదని చెప్పారు. ఈ విషయాన్ని ప్రతి అధికారి మానవత్వంతో పరిగణించాలని, భవిష్యత్తులో ఎవరికైనా ఇలాంటి పరిస్థితులు రావచ్చని గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి హరిప్రియ, డి.ఆర్.ఓ రాంరెడ్డి, డి.ఆర్. డి.ఓ నర్సింహులు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Read Also: కేరళంలో యూడీఎఫ్ విజయం.. రాహుల్ ఏమన్నారంటే!
Follow Us On: X(Twitter)

